ఏ ఎల్ పురం హోమియోపతి డాక్టర్ బాధ్యతలు స్వీకరణ
డాక్టర్ "కిల్లాడ హేమలత"
RTVNEWS (లవకుశ)గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏయల్ పురం గ్రామంలోప్రభుత్వ హోమియోపతి డాక్టర్ గా కిల్లాడ హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమలత మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక కావడంతో మొదట పోస్టుంగ్ ఏ ఎల్ పురం కేటాయించారని తెలిపారు. నిత్యం రోగులందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వ హాస్పిటల్లో ఓపి పెంచేందుకు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. ఐదేళ్లుగా మూతపడిన హోమియో వైద్యశాలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో ఇక్కడ వైద్యశాలలో వైద్యాధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు.