No title

Rtv Rahul
0



మండల బీజేపీ అధ్యక్షుడుగా  శివకుమార్ ఏకాభిప్రాయ నియామకం తగదు.


జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు అరిమెల రాజు అభ్యంతరం.

తిరిగి ఎన్నిక జరాపల్సిందే.

RTVNEWS (లవకుశ)అల్లూరి జిల్లా కొయ్యూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షునిగా సంపరి శివకుమార్ ఏకగ్రీవ నియామకం తగదని కేవలం ఒకే సామాజిక  వర్గాన్నే దృష్టి లో పెట్టుకుని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయటం పట్ల జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు అరిమెల రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు అరిమెల రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11 న కొయ్యూరు లో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కొయ్యూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించవలసి ఉంది. దీనిలో భాగంగా కొయ్యూరు లో ఏర్పాటు చేసిన ఈ అధ్యక్ష పదవి పోటీకి 8 మంది వరకు పార్టీ లో పోటీకి సిద్దం అయినప్పటికి వీరిలో  ఆరుగురు విడ్రా అవగా ఇద్దరిలో ఏడాదిన్నర ఒకరికి, ఏడాదిన్నర మరొకరికి నియమించుటకు పార్టీ జిల్లా నాయకులు కూడా కృష్ణారావు, రాజారావు ల ఆధ్వర్యంలో నిర్ణయం చేసి తొలి దశలో సంపరీ శివప్రసాద్ కు (ఏడాదిన్నర కాలం)పనిచేయుటకు సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రకటించాలని నిర్ణయం చేసినట్టు బీజేపీ నాయకులు అరిమెల రాజు తెలిపారు. కానీ జిల్లా నాయకులు అలా చేయకుండా ఒకే వ్యక్తికి మూడేళ్లు పదవి కాలం అధ్యక్ష పదవి కొనసాగుతారని ప్రకటించినట్టు రాజు తప్పు పడుతున్నారు. పార్టీలో పదేళ్లుగా పనిచేస్తూ సీనియర్ అయిన తనను ఒప్పందం మేరకు ఏడాదిన్నర ఇవ్వకుండా చేయుటకు జిల్లా నాయకులు ఏకంగా ఒకే సామాజిక వర్గానికే మూడేళ్ళ పాటు అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇవ్వడం తగదని అరిమేల రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను కమ్మరి తెగ కు చెందిన వాడినానా లేక పదవికి తగననా అలా చేయటం పట్ల ఆ ఎన్నిక రద్దు చేసి తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని బీజేపీ గిరిజన మోర్చ అధ్యక్షులు అరిమెల రాజు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎంపిక ఏకపక్షంగా నిర్ణయించటం పట్ల తాను రాష్ట్ర బీజేపీ నాయకులు పురంధేశ్వరి, సోము వీర్రాజు తదితరులకు పిర్యాదు చేస్తున్నట్టు జిల్లా బీజేపీ మోర్చ్ అధ్యక్షులు అరిమెల రాజు ఈ ప్రకటన లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">