రంగురాళ్ల వారీలపై నిరంతరం పర్యవేక్షణ
ప్రజలకు వివిధ గ్రామాల్లో అవగాహన సదస్సులు
నర్సీపట్నం అటవీ శాఖ రేంజ్ అధికారి లక్ష్మ నర్స్
RTVNEWS (లవకుశ)అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో ఆరిలోవ, కరక సాలికమల్లవరం అటవీ ప్రాంతాల్లో ఉన్న విలువైన రంగురాళ్ల క్వారీలపై నిరంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని నర్సీపట్నం అటవీధికారి లక్ష్మీ నర్స్ తెలిపారు. శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో తమ సిబ్బందితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి లక్ష్మీనరస్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల్లో రంగురాళ్లు తవ్వకాలకు పాల్పడినట్లయితే అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరక ఎల్లవరం సాలికమల్లవరం గ్రామాల్లో గతంలో రంగు రాళ్లు తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై నిగా పెట్టి వారి కదలికలపై నిరంతరం సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా రంగురాళ్లు తవ్వకాలకు పాల్పడినట్లైతే సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని అలా సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోపిక ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా రేంజ్ అధికారి లక్ష్మీ నర్స్ తెలిపారు.