కామ్రేడ్ స్వర్గీయ బన్నీన మల్లయ్య సేవలు మరువలేనివి. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు" బాలేపల్లి వెంకటరమణ"

Rtv Rahul
0
కామ్రేడ్ బన్నీన మల్లయ్య సేవలు మరువలేనివి 

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ 




RTVNEWS( లవకుశ)గిరిజన ప్రాంతంలో గిరిజనులు భూ హక్కుల కోసం అంకితభావంతో పోరాటాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ బన్నీని మల్లయ్య అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ అల్లూరి జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ అభివర్ణించారు. శుక్రవారం కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో కామ్రేడ్ స్వర్గీయ బన్నిన మల్లయ్య 18వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి ఉల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో  పాల్గొన్న బాలేపల్లి వెంకటరమణ పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నేత మేక సూరిబాబు తో అనేక  భూ పోరాటాల్లోను గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసిన గిరిజన ప్రాంత ముద్దుబిడ్డ కామ్రేడ్ బన్నిన మల్లయ్య అని పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటాలు నేటి తరం మరచిపోకుండా గుర్తుంచుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద ప్రధానికంపై పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వారుఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో నేటికీ అనేక పల్లెలకు సరైన రహదారి సౌకర్యాలు లేక డోలుమెతలతో ప్రయాణాలు సాగించాల్సిన దుస్థితి గిరిజనులకు ఎదురవుతుందని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రహదారు లు మంచినీటి  విద్య వైద్యం వంటి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ఇరవాడ దేముడు, అల్లూరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వియ్యపు నానాజీ, అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు, రావణా పల్లి ఎంపీటీసీ ఇరవాడ సత్యవేణి, అనకాపల్లి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మేక సత్యనారాయణ, మాజీ సర్పంచులు కుడుముల రాజు, గుమ్మా రాంబాబు, అల్లూరి జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రీముల చంద్ర రావు, సిపిఐ సహాయ కార్యదర్శి కస్తూరి రమేష్, మండల సహాయ కార్యదర్శి ఉల్లి విజయ్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు మాదల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">