ఇస్రో శాస్త్రవేత్తగా కొయ్యూరుకు చెందిన మావూరి మణి జ్యోతి ఎంపిక

Rtv Rahul
0
ఇస్రో సైంటిస్ట్ గా మావూరి మణి జ్యోతి ఎంపిక 

ఆనందోత్సవంలో తల్లిదండ్రులు, అభినందనలు తెలిపిన ప్రజలు

RTVNEWS (లవకుశ )కొయ్యూరు మండల కేంద్రానికి చెందిన మావూరి మణి జ్యోతి ఇస్రో సైంటిస్టుగా ఎంపిక అయ్యింది. దీంతో సోమవారం తండ్రి మా ఊరి నాగేశ్వరరావు ( శివరాం టైలర్) తల్లి పద్మావతి కుమార్తెకు స్వీట్ తినిపించి అభినందించారు. ఈ మేరకు ఈమె 2023లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇస్రో సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్ గా ఎంపిక అయ్యింది. అప్పటినుండి ఉద్యోగం చేస్తూ2024, ఇస్రో జనవరిలో నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దీంతో సైంటిస్ట్ గా ఎంపిక అయినట్లు ఉత్తర్వులు రావడంతో తల్లిదండ్రులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. కొయ్యూరు మండలం నుండి ఇస్రో సైంటిస్ట్ గా ఎంపిక కావడంపై మండల నాయకులు, యువకులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. వృత్తి రీత్యా తండ్రి నిరుపేద టైలరింగ్ చేస్తున్నప్పటికీ కుమార్తెను కష్టపడి చదివించి ఇస్రో శాస్త్రవేత్తగా చేయడం పట్ల తండ్రి ప్రోత్సాహం  ఉందని ఆమె వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">