ఫొటో - గంజాయితో ముద్దాయిలు.
417 కిలోల గంజాయి తరలిస్తూ ఒకరు అరెస్టు.
RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద అక్రమంగా వ్యాన్ తో తరలిస్తున్న 417 కిలోల గంజాయి తో ఒకరిని అరెస్టు చేసినట్టు కొయ్యూరు ఎస్ ఐ కిషోర్ వర్మ తెలిపారు. వాహనాల తనిఖీల్లో భాగంగా చీడిపాలెం వద్ద తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుండీ బొలొర వ్యాన్ తో ఒక వ్యక్తి 417 కిలోల గంజాయిని మూటలు కట్టి తరలిస్తూ పట్టుబడినట్టు ఎస్ ఐ తెలిపారు. వీటి విలువ సుమారు 20.85 లక్షల రూపాయిలు ఉంటుందని తెలిపారు. గంజాయితో వ్యాన్ స్వాధీనం చేసుకుని ముద్దయిని అరెస్టు చేసినట్టు ఎస్ ఐ కిషోర్ వర్మ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పలువురు పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.