కొయ్యూరు,మంప పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన చింతపల్లి డిఎస్పీ ." షేక్ షాబాస్ అహ్మద్"

Rtv Rahul
0
కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల ను చింతపల్లి డిఎస్పీ తనిఖీ.

డిఎస్పి " షేక్ . షాబాజ్ ఆహ్మద్".



 RTVNEWS (లవకుశ)కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్లు ను చింతపల్లి డి ఎస్పి షాబాజ్ అహ్మద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ ఉన్న రెండు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా అన్నీ రికార్డులను , పోలీస్ స్టేషన్లు పరిస్థితి, సెక్యూర్టీ ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన పరిశీలించి  క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, కొయ్యూరు ఎస్ ఐ కిషోర్ వర్మ, మంప ఎస్ ఐ శంకరరావు లతో సమావేశమై ఆయా స్టేషన్లు లో ఏడాది పాటు వివిధ కేసుల్లో లభ్యమైన గంజాయి నిల్వలను డిఎస్ పి పరిశీలించారు. గడిచిన ఏడాదిగా రెండు స్టేషన్లు పరిధిలో నమోదు అయిన కేసుల పై వాటి పరిష్కారం, పురోగతి పట్ల ఆయన  సమీక్షించారు. అనంతరం స్టేషన్లు భద్రత వైఫల్యాలను సిబ్బంది పనితీరు ను అడిగి తెలుసుకున్నట్టు సి ఐ వెంకటరమణ,ఎస్ ఐ లు కిషోర్ వర్మ ,  శంకరరావు లు తెలిపారు. స్టేషన్లు తనిఖీ చేసిన డి ఎస్పీ   షాబాజ్ అహ్మద్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు వారు తెలిపారు. ప్రధానంగా  మారుమూల గ్రామాల్లో గిరిజనులకు గంజాయి పంట నిర్మూలన, అక్రమ రవాణా జోలికి వెళ్ళే వాళ్ళను గుర్తించి అవగాహాన పరచటం ద్వారా మండల పరిదిలో గంజాయి నివారణ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డి ఎస్పీ సి ఐ, ఎస్ ఐ లకు ఈ తనిఖీల్లో ఆదేశించినట్టు సి ఐ వెంకటరమణ, ఎస్ ఐ లు కిషోర్ వర్మ, శంకరరావు లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">