మావోయిస్టులో వారోత్సవాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ
రాజేంద్రపాలెంలో విద్యార్థులు మానవహారం
RTVNEWS (లవకుశ)సిపిఐ మావోయిస్టులకు వ్యతిరేకంగా కొయ్యూరు మండల కేంద్రంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం మావోయిస్టులు డిసెంబర్ 2 నుండి 8 వరకు పి ఎల్ జి ఏ వారోత్సవాలు నిర్వహిస్తూ బందులు చేయడం సరికాదని ఆదివాసి అభివృద్ధిని సిపిఐ మావోయిస్టులు దూరం చేస్తున్నారని వారు అన్నారు. మండలంలో కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని మావోయిస్టులకు వ్యతిరేకంగా వివిధ నినాదాలు చేశారు. అనంతరం రాజేంద్రపాలెం కూడలిలో మానవహారంగా ఏర్పడి సిపిఐ మావోయిస్టులు వారోత్సవాలు ఎందుకోసం ఎవరికోసమని వారు అన్నారు గిరిజన బిడ్డలైన ఆదివాసీలను చంపడం కోసమా అని విద్యార్థులు ప్రశ్నించారు అమాయక గిరిజనులను చంపి ఉన్న గ్రామాలను తగలబెట్టడం మీరు చేసే వారోత్సవాల అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులారా మాకు వద్దు ఈ భాగస్వామి ఎవరికోసం తోపాలు దేనికోసం వారోత్సవాలు జరపాలి అంటూ బ్యానర్లు పట్టుకొని ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు