కొయ్యూరు మండలం లో గరిమండ కన్నవరం గ్రామాల మధ్య రహదారి కల్వర్టు నిర్మించాలి. సర్పంచ్ "సాగిన ముత్యాలమ్మ "వార్డ్ మెంబర్ "సాగిన సంజీవ్".

Rtv Rahul
0
గరిమండ ,కన్నవరం గ్రామాల మధ్య రహదారి కల్వర్టు నిర్మించాలి

సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డ్ మెంబర్ సాగిన సంజీవ్ 


RTVNEWS (లవకుశ)దేవుడు వరమిచ్చిన పూజారి కనుకరించడనే సామెతల మారుమూల మండలంలో పంచాయతీ బూధరాళ్ల పరిధిలో గల గ్రామస్తులు పరిస్థితులు తయారయ్యాయని సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డు మెంబర్ సాగిన సంజీవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ కొయ్యూరు మండలంలోనే అతి మారుమూల పంచాయతీ అయినా బూధ రాళ్ల పరిధిలో గరిమండ కన్నవరం గ్రామాల మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల రహదారిని కల్వర్టును కాంట్రాక్టర్ మధ్యలో నిర్మాణము పనులు చేపట్టకుండా నిలిపివేయడంతో అవతల వైపు ఉన్న గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కన్నవరం వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో నల్లబెల్లి, బొడ్డు మామిడి, బి కొత్త వీధి, నేరెళ్ల బంధ, రాజులపాడు, గ్రామాల ప్రజలు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు, ప్రయాణాలు చేసేందుకు నాన అవస్థలు ఎదుర్కోవలసిన దుస్థితి వారికి ఎదురైందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన గరిమండ గన్నవరం రహదారిని , కల్వర్టును నిర్మించి ఆ ప్రాంత ప్రజల యొక్క కష్టాలను తీర్చాలని ఈ సందర్భంగా సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ వార్డ్ మెంబర్ సంజీవ్ కోరారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">