పరదేశి పాకల లో సోలార్ నీటి ట్యాంకు మరమ్మతులు చేపట్టాలి
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు డిమాండ్
RTVNEWS (లవకుశ )బంగారం పేట పంచాయతీ పరిధిలోగల పరదేశి పాకల గ్రామంలో సోలార్ నీటి ట్యాంకు మరమ్మతులు గురై మంచినీటికి ఇబ్బందులు పడుతున్న ఏ ఒక్కరు స్పందించకపోవడం దారుణమని భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో సిపిఐ కార్యదర్శి ఇరవాడ దేముడు మాట్లాడుతూ కొయ్యూరు మండలం బంగారంపేట పంచాయతీ పరదేశిపాకల గ్రామంలో గల సోలార్ మంచీ నీటి ట్యాంకు మరమతుల గురై ఆరు నెలలు అవుతున్న పంచాయతీ కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ స్పందించలేదని గ్రామస్తులు తెలిపినట్లు దేవుడు అన్నారు. ఆరు నెలల నుండి మంచినీటి కొరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించడంలో అలసత్వం ఎందుకు చేపడుతున్నారు అర్థం కావడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి సోలార్ మంచినీటి ట్యాంకులు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీటి కష్టాలు తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని ఇరవాడ దేముడు ఈ సందర్భంగా తెలియజేశారు