కొమ్మిక అశ్రమ పాఠశాలలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమ్మర్ల సంధ్య
RTVNEWS (లవకుశ )కొయ్యూరు మండలం కొమ్మిక గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమ్మర్ల సంధ్య ఆధ్వర్యంలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయులు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు .ముందుగా విద్యార్థుల యొక్క క్లాస్ ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు యొక్క స్థితిని అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు రంగువల్లిక పోటీలు, ట్యాగ్ ఆఫ్ ద వార్ వంటి ఆటలపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమ్మరుల సంధ్య మాట్లాడుతూ విద్యార్థులు బడి నుండి ఇంటికి వచ్చాక ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యాలయంలో విజ్ఞానం ఉంటుందని, విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత చదువులు అధిరోహించాలని ఆకాంక్షించారు విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆమె సూచించారు దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కెరియర్ గైడ్లైన్స్ లో భాగంగా 40 అంశాలపై విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు.. అనంతరం ఆటల పోటీల్లో గెలిచిన తల్లిదండ్రులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మిక పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు స్కూల్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు