గొలుగొండ ఉప సర్పంచ్ సేనాపతి రమేష్ కు జనసేనకు సంబంధం లేదు
జనసేన పార్టీ మండల అధ్యక్షులు గడేం దొరబాబు
RTVNEWS(లవకుశ). మండల కేంద్రమైన గొలుగొండ పంచాయతీ ఉపసర్పంచ్ సేనాపతి రమేష్ కు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గడెం దొరబాబు అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో దొరబాబు మాట్లాడుతూ గొలుగొండ ఉపసర్పంచ్ వైయస్సార్సీపి పార్టీని వీడి జనసేనలో చేరినట్లు వస్తున్న వార్తలో అవాస్తమని ఆయన అన్నారు. జనసేన పార్టీ ఆమోదం అధిష్టానం నిర్ణయం లేకుండా ఇతర పార్టీల సభ్యులను జనసేన పార్టీలో చేర్చుకోవడం జరగదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.