జోగంపేట పశువులు సంతలో లేగ దూడలు ప్రదర్శన
గొలుగొండ పసుపు వైద్యాధికారి" లోకుల రమేష్"
RTVNEWS (లవకుశ)గొలుగొండ మండలంలో రైతులు అందరూ జోగంపేట పశువులు సంతలో శుక్రవారం ఏర్పాటు చేసే లేగ దూడలు ప్రదర్శన లో పాల్గొని వారు పెంపకం లో ఉన్న లేగ దూడలు ప్రదర్శించాలని గొలుగొండ పశు వైద్య అధికారి డాక్టర్ లోకుల రమేష్ తెలిపారు. ఈ మేరకు గురు
డాక్టర్ రమేష్ విలేకరులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. 6 తేదీ అనగా శుక్రవారం జోగంపేట జంక్షన్ లో మెగా లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పశుఘనాభివృద్ధి ద్వారా నిర్వహిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది కావున ఒక సంవత్సరం లోపు లేగదూడలను రైతు సోదరులందరు తీసుకురావలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రంలో జిల్లా అధికారులు పాల్గొంటారు.