అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమస్యలు పాలకులకు పట్టవా! జడ్పీ చైర్మన్ "జల్లిపల్లి సుభద్ర"

Rtv Rahul
0
*ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమస్య పాలకులకు పట్టదా* 

 *జడ్ పి చైర్ పర్సన్ సుభద్ర* 


RTVNEWS (లవకుశ)సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను సి ఆర్ టి లుగా మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట ఔట్సోర్సింగ్  ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన దీక్ష 17వ రోజు కొనసాగింది. ఉపాధ్యాయుల దీక్షకు ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి సోమవారం సంఘీభావం తెలుపుతూ దీక్షా శిబిరంలో కొనసాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 191 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న 1633 మంది ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సుమారు గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన దీక్ష చేపట్టిన ఉన్నతాధికారులు గాని ప్రభుత్వం గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ  సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయ యూనియన్ నేతలు కొండబాబు, వెంకటేశ్వర్లు, రత్నాకర్, శేఖర్, పోతురాజు, చక్రి, నాయుడు, రాధాకృష్ణ తదితర పలువురు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">