ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కృష్ణదేవపేట ఎస్సై వై తారకేశ్వరరావు

Rtv Rahul
0
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి 

కృష్ణ దేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు 


. RTVNEWS (లవకుశ)ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని లేకుంటే అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కృష్ణ దేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఎస్సై తార్కేశ్వరరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో రోడ్డు ప్రమాదాల బారి నుండి బయట పడవచ్చు అన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. అలాంటప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పూర్తిగా తగ్గుతాయని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ దారణపై వాహనదారులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులు అందరికీ ఫైన్ వేయడం జరుగుతుందని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">