ఆదివాసీలకు స్వయం పాలన రాష్ట్రాలు ఇవ్వాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతిపత్రం

Rtv Rahul
0
ఆదివాసీలకు స్వయం పాలన రాష్ట్రాలు ఇవ్వాలి: ప్రధానమంత్రి కి వినతి

ఆదివాసీ పార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ "మెట్టడం రాజబాబు"


RTVNEWS (లవకుశ)ఆదివాసీలకు ప్రత్యేకంగా స్వయం పాలన రాష్ట్రాలు ఇవ్వాలని భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి కోరారని ఆదివాసి పార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ మెట్టడం రాజబాబు తెలిపారు.. ఈ సందర్భంగా స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో రాజబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ కలిసి దేశంలో ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలకు ప్రత్యేక స్వయం పాలన రాష్ట్రాలు కావాలని కోరుతున్నారని,1913 నుండే రాజస్థాన్,గుజరాత్,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ లో గల భిల్ తెగ నివసించే ప్రాంతాన్ని భిల్ ప్రదేశ్ రాష్ట్రం కావాలని కోరుతున్నారని, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా స్వయం పాలన రాష్ట్రాలు కావాలని ఆదివాసీల డిమాండ్ ఉందని,ఆదివాసీల భాష, మరియు సాంస్కృతిక సజాతీయతను,ఆచార వ్యవహారాలను, సాంప్రదాయలను గౌరవించాలని,రాజ్యాంగంలో 5 వ షెడ్యూల్డ్ భూభాగంలో ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం ఉందని,ఆదివాసీలు ఈ దేశానికే మూలవాసులని, వారిని గౌరవించాల్సింది పోయి అవమాన పర్చుతున్నారని,ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు వ్యతిరేకంగా  ప్రాజెక్టులను కడుతూ ఆదివాసీలను నిర్వసితులను చేస్తున్నారని, కనీసం వారికి నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వకపోవడం బాధకరమని ప్రధాని వద్ద రాజ్ కుమార్ రోత్ ఆవేదన వ్యక్తం చేశారు.భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ లాగా మిగతా ఆదివాసి ప్రజాప్రతినిధులు ఆదివాసీల పక్షాన నిలబడి జాతి కోసం పని చేయాలని భారత్ ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">