ఏళ్లు గడుస్తున్న ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష. ఆదివాసి జేఏసీ నాయకులు అశోక్ లాల్

Rtv Rahul
0
ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష 

ఆదివాసి జెఎసి నాయకులు అశోక్ లాల్


RTVNEWS (లవకుశ)రాష్ట్ర ప్రభుత్వం  లో ఉన్న విద్యాలయాల్లో తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం చిరస్మరణీయం కానీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విద్య అనేది విద్యార్థికి  అందని ద్రాక్ష, కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలా భవనాలు శిథిలావస్థకు చేరిన వీ మరికొన్ని విద్యార్థులపై స్లాబ్ పై ముక్కలు ఊడిపడేవి మరికొన్ని వర్షం కురిస్తే కారిపోయే రేకుల షెడ్డు లు పాకలలో పాఠశాలలు పశువుల పాకలు తలపిస్తాయి. ఆదివాసి తల్లిదండ్రులు ఎక్కువ శాతం మందికి చదువు గురించి తెలియకపోవడం వల్ల తన పిల్లవాడు బడినుండి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే తిరిగి బడికి పంపించాలి అని విద్యార్థికి ప్రతిరోజూ విలువైన సమయం అని తెలియక ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచ్చేయడం వల్ల కొన్ని క్లాసు లకు విద్యార్థి దూరం అవడం , బడి ఈడు ఉన్న పిల్లలు బడికి వెళ్ళక పోవడం, కొన్ని  మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో  నూటికి 90 శాతం మంది విద్యార్థులు  విద్యకు దూరం అవుతున్నారు.విద్యార్థి ఉంటే ఉపాధ్యాయుడు ఉండడు ఉన్న తను స్కూల్ కి నెలకు ఒకసారి వెళ్లి 5,లేక 6 వేల రూపాయలు ఇచ్చి ఒక వాలంటరీ నీ పెట్టీ  లక్షలు జీతం తీసుకునే తను మాత్రం మైదాన ప్రాంతంలో  రిలాక్స్ అవుతుంటారు.ప్రాథమిక విద్య విద్యార్థికి పునాది.పునాది లేకుంటే ఆ విద్యార్థి 8 ,9,10 వ తరగతి చదువుతున్న అక్షరాలు రాని విద్యార్థులు ఎందరో  గత ప్రభుత్వం లో ఇంగ్లీష్ మీడియం నాడు నేడు, ఈ ప్రభుత్వంలో విద్యలో ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చిన  ఆ విద్యార్థికి ప్రాథమిక విద్య దశలో  విద్య అందుతుందా లేదా అని చూడ  కుండా ఎన్ని సంస్కరణలు తీసుకొని వచ్చిన అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.ప్రైవేట్ స్కూల్స్ లో ఉపాద్యాయుల నెలకు జీతాలు 15 వేలు ,విద్య ప్రమాణాలు చూస్తే నూటికి 90 శాతం విద్య విద్యార్థికి అందిస్తారు.ఒక ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థికి  అందుతున్న విద్య ప్రమాణాలు ప్రభుత్వ  పాఠశాల లో  కొంత మంది ఉపాధ్యాయుని జీతాలు నెలకు లక్ష,సంవత్సరంలో 12 లక్షలు ఆ ఉపాద్యాయులు రోజు స్కూల్ కి వెళ్ళలేకపోయినా పరవా లేదు మండల విద్య శాఖ అధికారులు జిల్లా స్థాయి అధికారులు, ఐటీడిఏ అదికారులు ఎవ్వరికీ పట్టదు ఎందుకు అంటే నా నెల జీతం నాకు వస్తుంది.అనే స్వార్థం నేను ప్రజాస్వామ్యం లో ఉన్నాను ప్రజల డబ్బును తనకు జీతం గా నెల నెల ప్రభుత్వం ఇస్తుంది నా బాధ్యతగా తీసుకునే జీతానికి పని చేయాలి అని కాకుండా రేపటి తరం విద్యార్థులు అని బాధ్యతగా తీసుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు అని ఉపన్యాసాలలో ఊదర గొట్టే ప్రజా ప్రతినిదులు ,ఉద్యోగులు ఆదిశగా పనిచేస్తున్నామా అని ప్రతిఒక్కరూ  ఆత్మ పరిశీలన చేసుకోవాలి వారి పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో   ఉన్నత.చదువులు చదువుతారు.  ఏజెన్సీ ప్రాంతం లో 1990 వరకు నూటికి 90 శాతం  ఉన్న విద్య ప్రమాణాలు ఇప్పుడు నూటికి 10 లేక 20 శాతానికి ఎలా పడిపోయింది. ఆశ్రమ పాఠశాలలో పోషకాహార లోపంతో 100 ల మంది విద్యార్థుల మరణాలు, ఈ  మధ్య కాలంలో కొయ్యూరు మండలం డౌనూరు స్కూల్ లో ఉపాధ్యాయుడు  ఓ సబ్జ్ జక్ట్ కి లేషన్ చెప్పలేక పోయాడు అని  ఐ టీ డీ ఏ .పివో సస్పెండ్  చేసిన పరిస్థితి, ముక్కి మూలుగుతూ ఓ విద్యార్థి 10 వ తరగతి చదువు కొని ఇంటర్,డిగ్రీ,పీజీ ఇలా ఉన్నత చదువులకు ఎంత మంది విద్యార్థులు వెళుతున్నారు. ఐ ఐ టి,నీట్ పరీక్ష ల ద్వారా ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులు ఎంత మంది వెళుతున్నారు అంటే నూటికి 1 లేక 2 మరి ప్రభుత్వాలు ఖర్చు చేసే కోట్ల రూపాయలు ఏ మౌ తున్నాయి. టెన్త్ పాస్, ఇంటర్ పెయిల్ అయిన కొంత మంది  ఇంట్లో కష్ట పడలేక లెగ్జరికి అలవాటు పడడం తీవ్ర వాదం మధ్య పాణం,మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఇలా అరా కోరా సౌకర్యాలు అంది అందని విద్య ఇది మనం రేపటి పౌరుడికి ఇచ్చే భవిష్యత్ ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించ కుండా ఎన్నాళ్ళు గడిచిన విద్యార్థికి విద్య అందని ద్రాక్ష అంటున్నా కొయ్యూరు మండల ఆదివాసి జే ఏ సి నాయకులు ఎస్.అశోక్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">