ఎస్సీ వర్గీకరణలో రెళ్లిలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి
రెల్లి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కోనా నారాయణరావు, జిల్లా సామాజిక రెల్లి కులాల జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అప్పన్న బాబు
RTVNEWS (లవకుశ)ఎస్సీ ఏ బి సి వర్గీకరణలో రెళ్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని రెళ్లి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కోనా నారాయణరావు. జిల్లా సామాజిక రెల్లి కులాల జిల్లాఅధ్యక్షుడు ఎర్రం శెట్టి అప్పన బాబు డిమాండ్ చేశారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట గ్రామంలో నాతవరం కొయ్యూరు జికే వీధి గొలుగొండ మండలాల నుండి తరలివచ్చిన వారితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బాబు జగజీవ్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నాయకులు కోన నారాయణరావు ఎర్రం శెట్టి అప్పన్న బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో భాగంగా 2004లో రెళ్లి కులస్థులకు ఒక్క శాతమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని వారు అన్నారు. దీంతో ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్న వారికి మాత్రమే అధిక రిజర్వేషన్ కల్పిస్తున్నారని కానీ స్వతంత్రం ముందు నుండి అన్ని రంగాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించడంలో మాత్రం అన్యాయం జరిగిందన్నారు. అంబేద్కర్ కలల కన్నా సామాజిక న్యాయం సమాన పంపిణీ జరగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంఘం నాయకులు మజ్జి సత్యనారాయణ, బంగారు లక్ష్మి నారాయణ, బంగారు కృష్ణ, కోలంకి కొండబాబు, సింగారపు నాగరాజు, సింగారపు శేషు, సింగారపు ఈశ్వరరావు, సింగారపు కన్నారావు తదితరులు పాల్గొన్నారు