కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. రాష్ట్ర మాజీ డిసిసి చైర్మన్ "ఎం వి వి ప్రసాద్"

Rtv Rahul
0
అధికారం చేపట్టి ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు 

కొత్తపల్లిలో 22 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజ్ ప్రారంభం

రాష్ట్ర మాజీ జిసిసి చైర్మన్ "ఎం వి వి ప్రసాద్"


RTVNEWS (లవకుశ)కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలోనే పాడేరు నియోజకవర్గం లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జిసిసి చైర్మన్ ఎం వి వి ప్రసాద్. తెలియజేశారు. సోమవారం మండలంలో అంతాడ పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులు ఎం వి వి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలను కలుపుకొని భాష జాలాలకు పోకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుర్ల చంద్ర రావు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి గత నాలుగు ఏళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అయితే కొత్తపల్లి గ్రామంలో పంట కాలువ ఊరి మధ్యలో ఉన్నందున చిన్నపాటి వర్షం వచ్చిన ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని ఎం వి వి ప్రసాద్ దృష్టికి సర్పంచ్ చంద్ర రావు ఎంపీటీసీ ఇరవాడ సత్యవేణి తీసుకువెళ్లారు. స్పందించిన ప్రసాదు ఆర్డబ్ల్యూఎస్ జేఈ రామకృష్ణ తో మాట్లాడి త్వరితగతిన పంట కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కాకూరి చందర్రావు బంగారంపేట పాంగిరాజు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">