వైసిపి పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా లోచల సుజాత
మాజీ ముఖ్యమంత్రి జగనన్న, మాజీ ఎమ్మెల్యే గణేష్ కు కృతజ్ఞతలు
. RTVNEWS( లవకుశ)వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా గొలుగొఃడ మండలం మేజర్ పంచాయతీ ఎఎల్ పురం సర్పంచ్ లోచల సుజాతను నియమించారు.. ఈ సందర్భంగా లోచలసుజాత మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతాయుతమైన జిల్లా మహిళా అధ్యక్షురాలు పదవి బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కు నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ కు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనపై నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతలు పట్ల బాధ్యతగా ఉండి గ్రామస్థాయి నుండి వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు సత్యవంచన లేకుండా కృషి చేస్తానని 2029 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమెఈ సందర్భంగా తెలియజేశారు