కొంగసింగిలో ఎంపీపీ నిధులతో మంచినీటి బోరునిర్మాణం
ఎంపీపీ గజ్జలపు మణికుమారి
RTVNEWS.(లవకుశ)ప్రజలు దాహార్తి తీర్చేందుకుగాను మంచినీటి బోరు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎంపీపీ గజ్జలపు మణికుమారి అన్నారు. మండలంలో కొంగ సింగి గ్రామంలో ఎంపీపీ నిధులతో చేపట్టిన మంచినీటి బోరును సోమవారం ఎంపీపీ గజ్జలపు మణికుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో ప్రజలు అవసరాలు రీత్యా ఈ మంచినీటిబోరును నిర్మించడం జరిగిందని ఆమె తెలిపారు. తమ నిధులు ను ప్రాధాన్యత క్రమంగా కేటాయించడం జరుగుతుందని అమె సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ సత్యవతి , లగుడు శ్రీను, సాయి మంగరాజు ఎస్సీ కాలనీ మహిళలు పాల్గొన్నారు