ఘనంగా కామ్రేడ్ మాకిరెడ్డి రాజబాబు 26వ వర్ధంతి
సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ
RTVNEWS( లవకుశ)ఉద్యమ నేత కామ్రేడ్ మేక సూరిబాబు స్ఫూర్తితో యువజన రంగాల నుండి భారత కమ్యూనిస్టు పార్టీ జెండా పట్టుకుని అనేక భూ పోరాటాలు ప్రజా సమస్యల పైన పోరాటాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ మాకిరెడ్డి రాజబాబు అని భారత కమ్యూనిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అన్నారు బుధవారం చోద్యం జంక్షన్లో మాకిరెడ్డి రాజబాబు స్తూపం వద్ద 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు మేధావులు ఆలోచనతో రానున్న రోజుల్లో కేంద్రం లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ సంపద అప్పులు ఊపులో పెట్టి జిమిలి ఎన్నికల వల్ల దేశ ప్రజలందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు బిజెపి ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ సంస్థలకు చేయూతనివ్వడం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు పెట్టి వాటిని కాపాడాలని ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏమాత్రం లేదని విమర్శించారు. మతాల పైన కులాల పైన రాజకీయాలు శిక్షలు పెట్టడమే లక్ష్యంగా చేసుకొని పదవులు పొందుతున్నారన్నారు తప్పితే అధికారంలో ఉన్నామని ప్రశ్నించే వాళ్ళపై కేసులు బనాయించడం తప్ప మరి ఏ ఆలోచన మాత్రం లేదని అన్నారు. దేశంలో ఇదే రకంగా కొనసాగితే ఎర్రజెండా పక్షాన దశలవారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు మేక సత్యనారాయణ శివలంక కొండలరావు జి రాధాకృష్ణ మేక భాస్కరరావు ఇరవాడ దేముడు నానాజీ కొయ్యూరు జడ్పిటిసి వార నూకరాజు వైస్ ఎంపీపీ సుర్ల ఆదినారాయణ (బాబ్జి) పోతల సత్యనారాయణ మాకిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు