విద్యార్థిని మృతికి పాఠశాల హెచ్ఎం, వార్డెన్ నిర్లక్ష్యమే కారణం. ఏపీ గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి "కూడా రాధాకృష్ణ"

Rtv Rahul
0
*విద్యార్థిని మృతికి పాఠశాల హెచ్ఎం, వార్డెన్ నిర్లక్ష్యమే కారణం*.

*విద్యార్థినికి దయ్యం పట్టిందని  కొట్టిన వార్డెన్*.

*మృతిచెందిన మర్ల సత్యవతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి*. 

*తాటిపర్తి స్కూల్ హెచ్ఎం, వార్డులను తక్షణమే సస్పెండ్ చేయాలి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్*.

RTVNEWS (లవకుశ)తాడిపర్తి స్కూల్ 9వ తరగతి చదువుతున్న మర్ల సత్యవతి  గత ఐదు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ శుక్రవారం ఉదయం చోడవరం ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందింది. ఐదు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ స్కూల్లో దొర్లు దొర్లు ఏడుస్తున్న కనీసం స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా, విద్యార్థినికి దయ్యం పట్టిందని, కొట్టినటువంటి వార్డెన్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం ను తక్షణమే సస్పెండ్ చేసి మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ,ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ: మర్ల సత్యవతి  సోమవారం నుండి కడుపునొప్పితో బాధపడుతున్నప్పటికీ కనీసం స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా, ఆసుపత్రుల్లో చేర్పించ కుండా  విద్యార్థినికి దెయ్యం పట్టిందని వార్డెన్ కొట్టడంతో, హెచ్ఎం నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెందిందని, వారన్నారు తమ కూతురు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న తల్లితండ్రులు  స్కూలుకి రావడంతో పరిస్థితి విషమించటంతో నిన్న 11 గంటల సమయంలో మాడుగుల ఆసుపత్రికి తీసుకువెళ్లాగా మేమేం చేయలేము అని  చేతులెత్తయగా, ఈరోజు ఉదయం చోడవరం ప్రైవేట్ ఆస్పత్రిలో ఉదయం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తమ కూతురు మృతి చెందిందని,  ఇంత జరిగినా కూడా కనీసం ఆసుపత్రిలో కూడా  స్కూల్ యాజమాన్యం రాలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.  కేవలం పాడేరు ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు రోజురోజుకీ  విద్యార్థుల మరణాలు సంఖ్య పెరుగుతుందని, కనీసం ఎందుకు చనిపోయారో  విచారణ చేయాలని  పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని  వారన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి, 
విద్యార్థిని మృతి పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వార్డెన్, హెచ్ఎంల పై తక్షణమే   అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వంతల కృష్ణ, గిరిజన సమాఖ్య  నాయకులు పాంగి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">