భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు
తాసిల్దార్ పి శ్రీనివాసరావు
RTVNEWS( లవకుశ)భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ పి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మండలంలో చోద్యం గ్రామంలో సర్పంచ్ ఆధపురెడ్డి గోపాలకృష్ణ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో ప్రజలు ఇచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంతవరకు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ వెంకట చైన్లు, మాజీ సర్పంచ్ ఆధపరెడ్డి ప్రభాకర్ రావు, మండల సర్వేయర్ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనివాసరావు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు అడిగర్ల స్వామినాయుడు, దేవాడ శేషు మాకిరెడ్డి చెన్నారెడ్డి, లగుడు వెంకటరమణ పలువురు రైతులు అధికారులు పాల్గొన్నారు