రోలుగుంట మండలం జానకి రామపురం పిఎసిఎస్ లో జరిగిన అక్రమాలపై చర్యలేవి? ప్రజా సంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర కార్యదర్శి "జక్కు నరసింహమూర్తి"

Rtv Rahul
0
రోలుగుంట మండలం జానకి రామపురం పిఎ సిఎస్ లో జరిగిన అక్రమాలపై చర్యలేవి?

విచారణ నివేదిక ఎక్కడ! 

ప్రజా సంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర కార్యదర్శి జక్కు నరసింహమూర్తి 
RTVNEWS(లవకుశ)అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జరుగుతున్న పలు అక్రమాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని దీంతో జిల్లా అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇప్పటికైనా తక్షణమే చర్యలు చేపట్టి ప్రభుత్వ సొమ్మును అక్రమార్కుల నుండి రికవరీ చేయాలని ప్రజా సంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర కార్యదర్శి జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రోలుగుంట మండలం జానక రామపురం పిఎసిఎస్ లో జరిగిన అక్రమాలపై రైతులు ఫిర్యాదులు చేశారని, బినామీ పేర్లతో రుణాలు చూపించడం తోసొసైటీ కార్యదర్శి పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారని విచారణ పేరుతో కాలం గడుపుతున్నారు తప్ప చర్యలు లేవన్నారు. అసలు నివేదిక ఎక్కడ అని ప్రశ్నించారు. ఇదే మండలంలో కొన్ని సొసైటీలపై కూడా ఫిర్యాదులు చేశారని అయినప్పటికీ స్పందన లేదన్నారు. అసలు సొసైటీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నాయని వెలుగులోకి వస్తున్న జిల్లా అధికారులు ఎంతవరకు తీసుకున్న చర్యలు బహిరంగ పరచాలన్నారు. ఇదే మండలంలో వికలాంగ సమైక్యలో బినామీలుగా చూపించి 45 లక్షలు స్వాహా చేశారని వికలాంగులను మోసం చేశారని జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసి విచారణలో నిర్ధారించి అప్పట్లో పనిచేసిన వెలుగు ఉద్యోగులకు సోకాస్ నోటీసులు ఇచ్చారని అన్నారు. రోలుగుంట మండలంలో ఇన్ని అక్రమాలు జరిపి ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నారని అయినప్పటికీ జిల్లా అధికారుల్లో చలనం లేదన్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టి అక్రమాలు నిరోధించి ఉద్యోగుల్లో జవాబుదారి తనం పారదర్శకతతో పని చేసే విధంగా పిఎసిఎస్ లో అవినీతి నిరోధించాలని రాష్ట్ర కార్యదర్శి జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">