దిక్కులేని అభాగ్యురాలికి అప్పన్న హస్తం
మానవత్వం చాటుకున్న వనిమిన శ్రీను
RTVNEWS (లవకుశ)నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకుండా దీనావస్థలో ఉండి వృద్ధాప్యంలో జీవనం సాగిస్తున్న గిరిజన మహిళకు అప్పన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కొయ్యూరు మండలం బట్టబనుకుల పంచాయతీ శివారు గ్రామమైన లంక వీధి గ్రామానికి చెందిన ఇరటా రాములమ్మ కు కుటుంబ సభ్యులు ఏతోడు లేకుండా అర్ధాకలితో ఒంటరిగా జీవిస్తుంది. దీంతో "దిక్కులేని అభాగ్యురాలికి దిక్కెవరు"అఖండ భూమి దినపత్రికలో ప్రచురించిన వార్తకు కృష్ణా దేవి పేట గ్రామానికి చెందిన వనిమిన శ్రీను మానవత్వంతో స్పందించి వృద్ధాప్యంలో ఉన్న మహిళకు బ్యాగ్ రైసు, నిత్యవసర సరుకులు అయిన పప్పులు, నూనె ,సబ్బులు, కూరగాయలు, వంటివి అందించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ సందర్భంగా వనిమిన శ్రీను గ్రామస్తులతో మాట్లాడుతూ ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు ఏ అవసరం ఏర్పడిన తమ దృష్టికి తెలియపరచినట్లయితే సహాయం చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో నిత్యవసర సరుకులు అందించిన వనిమిన శ్రీనును గ్రామస్తులు పలువురు అభినందించారు.