సిపిఐ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా గ్రామాల్లో పార్టీ జండా ఎగరవెయ్యాలి
సిపిఐ మండల పార్టీ కార్యదర్శి మేకా భాస్కరరావు
RTVNEWS(లవకుశ). పేదలు, కర్షకులు, కార్మికులు పక్షాన నిరంతరం పోరాడే భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గ్రామ గ్రామాన సిపిఐ పార్టీశాఖల ఆధ్వర్యంలో జండాలను ఎగురు వెయ్యాలని భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి మేకా భాస్కరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక విలేకరులతో మేకా భాస్కరరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సిపిఐ పార్టీరాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 31 వరకు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 26వ తేదీన మండల కేంద్రమైన గొలుగొండలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసి బహిరంగ సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మండలంలో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులు అభిమానులు వేలాదిక తరలివచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు