అనారోగ్యంతో ఉన్నమాజీ ఏఎంసి డైరెక్టర్ దూడస్మిత్ కు 10,000 ఆర్థిక సహాయం చేసిన నేను సైతం "శివప్రసాద్"

Rtv Rahul
0
వైసిపి కార్యకర్తకు బాసటగా నిలిచిన అరకు మాజీ ఎంపీ జి మాధవి 

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం



RTVNEWS (లవకుశ)పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే కార్యకర్తలను అంతగా పట్టించుకోకుండా ఉండే ఈ రోజుల్లో కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, కార్యకర్తలు లేనిది రాజకీయ నాయకులు లేరని నమ్మిన అరకు మాజీ పార్లమెంటు సభ్యురాలు జి మాధవి అనారోగ్యంతో బాధపడుతున్న వైసిపి కార్యకర్తకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని ఉదార భావాన్ని చాటుకున్నారు. రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి కి చెందిన మాజీ ఏఎంసీ డైరెక్టర్ దూడస్మిత్ అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న అరకు మాజీ ఎంపీ జి మాధవి తన భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ కు తెలియజేయడంతో శనివారం దూడస్మిత్ ను ఆయన స్వగృహంలో పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మందులకు అయ్యే ఖర్చులకు తన వంతుగా సహాయం అందిస్తానని దూడస్మిత్ కు భరోసా ఇచ్చారు. దీంతో వైసిపి కార్యకర్త దూడస్మిత్ అరకు మాజీఎంపీ జి మాధవికి శివప్రసాద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">