మందులు షాపుల్లో తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. నర్సీపట్నం డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి

Rtv Rahul
0
మందులు విక్రయాలపై నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు 

నర్సీపట్నం డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి 


RTVNEWS (లవకుశ)నాణ్యతా లోపం అయిన మందులును మెడికల్ షాపుల్లో విక్రయించినట్లయితే కేసులు నమోదు తప్పదని నర్సీపట్నం డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మండలంలో ఏ ఎల్ పురం, చోద్యం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోగులకు , విక్రయించే ఇచ్చే మందులను తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రగ్  ఇన్స్పెక్టర్ కళ్యాణి మాట్లాడుతూ ఏ ఎల్ పురం2, చోద్యం లో  మందుల షాపులో విక్రయించే మందులను  అనుమానంతో క్వాలిటీ నిర్ధారణ పరీక్షలకు పంపించడం జరిగిందని అన్నారు. అలాగే చోద్యం లో మెడికల్ స్టోర్ లో శాంపిల్స్ ఉండడంతో వాటిపై ఆరా తీయగా వైద్య శిబిరానికి తెచ్చామని పాపు నిర్వాహకులు తెలిపారని చెప్పారు దీంతో ఆ మందులు సంబంధించి పూర్తి వివరాలు తెలపాలని చెప్పడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మందుల షాపుల్లో నాణ్యమైన మందులు విక్రయించాలని రోగులకు విక్రయించే మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని షాపులు యజమానులను ఆదేశించడం జరిగిందని, కొన్నిచోట్ల మందుల షాపుల్లో బిల్లులు ఇవ్వడం లేదని గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలు గ్రామాల్లో నాసిరకం మందులను విక్రయించినట్లయితే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసినట్లయితే ఆ షాపులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగాఅమె తెలిపారు .

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">