ఎం మాకవరం శివాలయంలో అన్న సమారాధన కార్యక్రమం
కోడా చిన్న తల్లి రాజు బాబు ఆధ్వర్యంలో
RTVNEWS (లవకుశ)కార్తీక మాసం పర్వదినాల్లో చివరి సోమవారం రోజున మండలంలో ఉన్న శివాలయాలు భక్తులు పూజలుతో కిటకిటలాడాయి. గాదిగుమ్మి శ్రీ తాండవేశ్వర స్వామి, పీ మాకవరం స్వయంభు నీలకంఠేశ్వర స్వామి, కొయ్యూరులో మల్లికార్జున స్వామి, ఎం మాకవరం శివాలయంలో ఉదయం నుండే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పి.మాకవరం శివాలయంలో కోడా చిన్న తల్లి ,రాజబాబు, పచ్చిపులుసు నరసయ్య ఆధ్వర్యంలో ఇక్కడకు తరలివచ్చే భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతి సోమవారం అన్న సమరాతన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ అన్న సమరాధనా కార్యక్రమంలో సమీప గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.