కొంగసింగిలో కల్వర్టు లేక రాకపోకలకు ఇబ్బంది
సీసీ రోడ్డు నిర్మించి కల్వర్టు మరచిన అధికారులు
RTVNEWS (లవకుశ) గొలుగొండ మండలం కొంగసింగి గ్రామంలో ముఖద్వారంలో సిసి రోడ్డు నిర్మించినప్పటికీ కల్వర్టు ఏర్పాటు చేయకపోవడంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేకసార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్న ఎటువంటి ప్రయోజనం లేదని వాహనదారులు ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు సాగించే ప్రజలు వాహనదారులు ప్రమాదాల బారిన పడి కాళ్లు చేతులు విరగ్గొట్టుకునే సంఘటనలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీలో అత్యవసర రహదారులు, కలవట్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రమాద భరితంగా ఉన్న ఈ కల్వర్టును నిర్మించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రమాదాల సంభవించక ముందే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు వాహనదారు కోరుతున్నారు.