బకులూరులోఅనుమానస్పద మృతి పై కేసు నమోదు
సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ
కొయ్యూరు మండలం బకులూరు గ్రామ శివారులో మృతి చెందిన వ్యక్తిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . జీకే వీధి మండలం ఎర్ర చెరువుల గ్రామానికి చెందిన బోసరి ధనుంజయ్ (20) మృతి చెందినట్లు తెలిపారు. బకులూరి గ్రామంలో ఉన్న అక్క ఇంటికి వచ్చి మూడు రోజులు ముందుగా వచ్చి ఈ నెల 12 రాత్రి పది గంటలు సమయం నుండి కనిపించడం లేదన్నారు. దీంతో గురువారం మృతుడు గ్రామ శివారులో జీడి తోటలో అనుమానాస్పదంగా మృతి చెంది గ్రామస్తులకు కంటపడ్డారు. దీంతో కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి కొయ్యూరు సీఐ వెంకటరమణ ఎస్సై కిషోర్ వర్మ చేరుకొని అనుమాన స్పద మృతిగా కేసు నమోదు చేసి క్లూస్ టీం తో వివరాలు సేకరిస్తున్నామన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వారి సందర్భంగా తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.