కామ్రేడ్ జంపా రాంబాబు సేవలు మరువలేనివి
సర్పంచ్ జంపా రాజకుమారి, మాజీ సర్పంచ్ గుమ్మ రాంబాబు
RTVNEWS(.లవకుశ )భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కామ్రేడ్ జంపా రాంబాబు గిరిజన ప్రాంతానికి భారత కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని నల్గొండ సర్పంచ్ జంప రాజకుమారి చింతలపూడి మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు అన్నారు. మంగళవారం మండలంలో నల్గొండ గ్రామంలో జంపా రాంబాబు 7వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని సర్పంచ్ రాజకుమారి మాజీ సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ జంపారాంబాబు దివంగత నేత కామ్రేడ్ మేక సూరిబాబు అనుచరుడిగా మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఎనలేని సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేతగా నీటికి గిరిజన ప్రజలు గుండెల్లో నిలిచి ఉన్నారని వారు అన్నారు. జంపా రాంబాబు మరణించి ఏడు సంవత్సరాల అయినప్పటికీ ఆయన చేసిన సేవలు నేటికీ ఆయనను స్మరించుకునే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వియ్యపు నానాజీ, ఉల్లి కుమార్, పల్లి కృష్ణం నాయుడు బచ్చల అన్నపూర్ణ జంపానూకరాజు తదితరులు పాల్గొన్నారు