క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత చదువులకు ఉపయోగపడతాయి. నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ.

Rtv Rahul
0
రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు అభినందించినలు 

నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ 

RTVNEWS.క్రీడల్లో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువుల్లో కోట ఉంటుందని వీటిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ అన్నారు. మంగళవారం కృష్ణ దేవి పేట ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో చిత్తూరులోజరిగిన స్కూల్ గేమ్స్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి విజయ ప్రవళిక బాల్ బ్యాట్మెంటన్ క్రీడల్లో ద్వితీయ స్థానం సాధించగా ఇదే పాఠశాలలో చదువుతున్న లంక పవన్ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడంతో ఇద్దరు విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ విద్యార్థులను అభినందించారు .ఈ కార్యక్రమంలో కృష్ణ దేవి పేట ఎస్సై వై తార్కేశ్వరరావు, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు   జీ వరలక్ష్మి ,పిడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">