సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులకు ప్రజలకు అవగాహన కృష్ణ దేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు
RTVNEWS (లవకుశ)సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తీవ్రంగా నష్టపోతారని గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు అన్నారు. సోమవారం కృష్ణ దేవి పేట ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం లో విద్యార్థులకు, ప్రయాణికులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై తారకేశ్వరరావు మాట్లాడుతూ అనుమానస్పద వ్యక్తుల నుండి ఫోన్లు వచ్చినప్పుడు ఓటీపీలు చెప్పమని ఎవరైనా అడిగితే వెంటనే సమీపంలో గల పోలీస్ స్టేషన్ కానీ 1930 నంబర్ కానీ సమాచారం అందించాలని ఆయన అన్నారు. మరికొందరు వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ముఠాలో కూడా ఉంటాయని వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సైబర్ నేరాల పట్ల ఎవరికి చెప్పుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతూ అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటన కూడా అనేక చోట్ల జరిగాయని ఆయన సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబులు వాసుదేవరావు, రమణ ప్రయాణికులు విద్యార్థులు పాల్గొన్నారు