ఉత్తర వాహిని లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు

Rtv Rahul
0
ఉత్తర వాహిని లో పుణ్య స్నానాలు ఎక్కడ? 

స్నానాలకు వచ్చి వెనుతురుగుతున్న భక్తులు 



RTVNEWS :పుణ్యక్షేత్రమైన పి. మాకవరం ఉత్తర వాహిని  ప్రాంతంలో స్నానమాచరించే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొయ్యూరు మండలం పి. మాకవరం గ్రామంలో వెలసిన స్వయంభు బ్రహ్మ లింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు అక్కడికి సమీపంలో గల ఉత్తర వాహిని లో స్నానమాచరించి వస్తుంటారు. అయితే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపడుతున్న రహదారి పుణ్యమా అని ఉత్తరవాహని కలుషితమై స్నానమాచరించేందుకు నదిలోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించేందుకు వస్తున్న భక్తులు స్నానమాచరించకుండా దర్శించుకోకూడదనే భక్తి భావంతో వెన్ను తిరుగుతున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి సోమవారం తో పాటు కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు కానీ ఈ ఏడాది అటువంటి విధంగా జరగకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రావడం తీవ్ర నిరాశకు గురై విని తిరగడం ఇక్కడ గత కొంత కాలంగా నిత్యం జరుగుతుంది. అయితే బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు గాని గ్రామ పెద్దలు కానీ ఈ ఉత్తరవాహని నదీ ప్రవాహ గురించి పట్టించుకోకపోవడంతోనే ఈ విధంగా భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయని మరికొందరు భావిస్తున్నారు ఇప్పటికైనా గ్రామ పెద్దలు భక్తులు సరైన నిర్ణయం తీసుకొని భక్తులు ఉత్తరవాహినిలో స్నానమాచరించే విధంగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు లేకుంటే జాతీయ రహదారి నిర్మాణం కారణంగా ఉత్తర్వాహని ఇలా తయారయిందని వారి చేతనైన మార్గం ఏర్పాటు చేయించాలని పలువురు కోరుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">