ఎస్పి తుహిన్ సిన్హా చేతుల మీదుగా కృష్ణా దేవి పేట ఎస్సైకు ప్రశంసా పత్రం
RTVNEWS (లవకుశ)గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులను అత్యంత సాకతక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కృష్ణదేవి పేట ఎస్సై తారకేశ్వరరావుకు, భీమవరం చెక్పోస్ట్ పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంస పత్రంతోపాటు నగదు అందించారు. కర్ణాటక చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో 12 లక్షల 50 వేల రూపాయలు నగదుతో ఏజెన్సీ ప్రాంతానికి రావడం పోలీసులు మెగా ఎక్కువ కావడంతో అక్రమ రవాణా చేయలేమని భావించి 25 కేజీలు గంజాయిని లక్ష 25 వేలు కొనుగోలు చేసి ఖర్చులు పోను 11 లక్షల 6వేల నగదును కారు ఇంజన్ భాగంలో అమర్చి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంపుల ఘాట్ రోడ్ నుండి అయితే పోలీసులు వాహన తనిఖీలు అధికంగా ఉన్నాయని భావించి రాజమండ్రి వైపు వెళ్తుండగా కృష్ణ దేవి పేట అల్లూరి సీతారాముల పాటు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుపడ్డారు దీంతో కృష్ణ దేవి పేట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు దీంతో వాహన తనిఖీల్లో పాల్గొన్న కృష్ణ దేవి పేట వై తారకేశ్వరరావుకు సిబ్బంది కె. సర్వేశ్వరరావు, కే ఆంజనేయులు, ఏవివి అప్పారావు కే చిరంజీవి ఏవి సతీష్ పి గోవిందరావు కె జి నాయుడు లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు తో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి పూర్తిస్థాయిలో నిరోధించేందుకు పోలీస్ శాఖ సిబ్బంది అనిత్యం చర్యలు చేపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు