సీఎం రిలీఫ్ ఫండ్ తో గిరిజనులకు కేజీహెచ్ లో శస్త్ర చికిత్స
సామాజిక సేవకుడు "అర్జున్ రెడ్డి"
RTVNEWS:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కొయ్యూరు మండలాలకు చెందిన ఇద్దరు గిరిజనులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విశాఖ కేజీహెచ్ లో శస్త్ర చికిత్స లు జరిగాయని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో అర్జున్ రెడ్డి మాట్లాడుతూ పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ సర్టిపుట్టి గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే గిరిజన యువతి ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ విశాఖ కేజీహెచ్ లో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతుంది అన్నారు. అలాగే కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ గంప రాయి గ్రామానికి చెందిన ఏలియా శరభన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుచున్నారు. ప్రమాదవశాస్తూ చెట్టిపైనుండి జారి పడటంతో కుడికాలు విరిగిపోయింది దీంతో మెరుగైన వైద్య నిమిత్తం ఇద్దరు గిరిజనులు విశాఖ కేజిహెచ్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు గిరిజనులకు ఆరోగ్యశ్రీ పథకం నమోదు కాకపోవడంతో సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి దృష్టికి కుటుంబ సభ్యులు తెలపడం జరిగిందన్నారు. దీంతో అర్జున్ రెడ్డి స్పందించి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడీఏ పీవో అభిషేక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ జమాల్ భాషా లకు సమాచారం అందివ్వడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరు గిరిజనులకి వైద్యం అందించినట్లు రోగుల కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ తో వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టిన అల్లూరి జిల్లా అధికారులకు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి కు కుటుంబకలు కృతజ్ఞతలు తెలియజేశారు.