మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు. డాక్టర్ డివి హేమంత్

Rtv Rahul
0
ఎర్రగొండ నీలవరం తీగల మెట్ట గ్రామాల్లోవైద్య శిబిరాలు 


వైద్యాధికారి డివి హేమంత్ 



RTVNEWS :కొయ్యూరు మండలంలో అతి మారుమూల యూ.చీడిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఎత్తైన కొండలపై ఉన్న మారుమూల గ్రామాలైన ఎర్రగొండ నీలవరం తీగల మెట్ట ల్లో వైద్యాధికారి డివి హేమంత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు బుధవారంఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న జ్వర పీడితులను పరీక్షించి ఆర్డిటి రక్త పరీక్షలు వంటివి నిర్వహించారు. అదేవిధంగా ఈ వైద్య శిబిరాల్లో ఏఎంసీ మరియు పిఎంసిలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలగిరిజనులతో వైద్యాధికారి డివి హేమంత్ మాట్లాడుతూ ఎటువంటి రోగాలు బారిన పడిన వెను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలివచ్చి వైద్య శిక్షణ చేయించుకోవాలని ఆయన సూచించారు అదేవిధంగా వేడి నీటిని ప్రతి ఒక్కరు తాగాలని అలాంటప్పుడే ఎటువంటి జ్వరాలు బారిన పడకుండా ఉంటారని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్సీ ఏఎన్ఎం యూ. చిడి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">