ఆపదలో ఉన్న అభాగ్యురాలికి ఆర్థిక సహాయం అందించిన నేను సైతం కుసిరెడ్డిశివప్రసాద్

Rtv Rahul
0
RTVNEWS (లవకుశ)అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ శివారు గ్రామమైన లంక వీధి కి చెందిన ఇరటా రాములమ్మ ఆర్థిక ఇబ్బందులపై పత్రికల్లో "దిక్కులేని అభాగ్యురాలికు ఎవరు" వచ్చిన వార్తలకు స్పందించి అరకు మాజీ ఎంపీ గోడ్డేటి మాధవి స్పందించారు. విను వెంటనే ఆమె ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ గిరిజన వృద్ధురాలు ఇరటా రాములమ్మను లంక వీధి గ్రామంలోపరామర్శించారు . మానవతా దృక్పథంతో  ఆమెకు రగ్గు, చీరలు , ఒక బ్యాగ్ బియ్యముతో పాటు 5000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ వృద్ధురాలు ఇరటా రాములమ్మకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఏర్పడిన తనను సంప్రదించాలని కుసిరెడ్డి శివప్రసాద్ తెలియజేశారు . అలాగే ఈ ప్రాంతంలో ఎవరైనా ఇలాంటి దీన పరిస్థితిలో ఉన్న వృద్ధులు వివరాలు తెలియజేసినట్లయితే వారికి కూడా తమ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇరటా రాములమ్మకు త్వరగా పెన్షన్ మంజూరు అయ్యేవిధంగా మాజీ ఎంపీ గుద్దేటి మాధవి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కినపర్తి సర్పంచ్ రీముల శ్రీనివాసు, బట్ట పలుకుల సర్పంచ్ దేశగిరి బాలకృష్ణ, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు అప్పలరాజు, బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రీముల చంద్రరావు సామాజిక సేవకుడు రంజిత్ కుమార్, హిందూ పరిరక్షణ సమితి సభ్యులు ఈరే మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">