చోడవరం వెలుగులో 20 లక్షలు స్వాహా
విచారణలతో సరి చర్యలు మాత్రం శూన్యం
థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కి ప్రజా సంకల్ప వేదిక డిమాండ్
RTVNEWS.అనకాపల్లి జిల్లా డిఆర్డిఏ పరిధిలోగల చోడవరం మండలం సీతారాంపురం వెలుగులో డ్వాక్రా సంఘాల సొమ్ము 20 లక్షల స్వాహా చేసిన వారిపై విచారణ చేపట్టి వీటికి సహకరించిన వెలుగు ఉద్యోగులు పై మరియు బ్యాంక్ సిబ్బందిపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రజాసంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర కార్యదర్శి జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా డిఆర్డిఏ లో కోట్లు రూపాయలు అక్రమాలు జరిగాయని దీనిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్ధారించి సోకాజ్ నోటీసులు ఇస్తున్నారు తప్పితే క్రమశిక్షణ చర్యలు కానీ ప్రభుత్వ సొమ్ము రికవరీ గాని చర్యలు లేవన్నారు. దీంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతుందన్నారు. ఇప్పటికే అనకాపల్లి డిఆర్డిఏ లో వెలుగు ద్వారా జరిగిన అక్రమాల్లో స్త్రీ నిధి, రోలుగుంట వికలాంగుల సమైక్య, ఎస్ హెచ్ జైలు, అవెన్యూ సీడ్ ఫ్ వంటి వాటిపై జిల్లా జిల్లా కలెక్టర్ నివేదికలు ఉన్న ప్రయోజనం లేదన్నారు. అక్రమాలను ప్రోత్సహిస్తున్నది వెలుగు ఉద్యోగులే విచారణ జరిపేది వెలుగు ఉద్యోగుల డి ఆర్ డి ఏ లో పారదర్శకత, జవాబుదారుతను ఎక్కడ కానరావడం లేదని అన్నారు. దీంతో వెలుగులో అవినీతి అనకొండలా మారిపోయింది అన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్న వారిని పక్కదారి పట్టించి క్రింద స్థాయి వారిపై చర్యలు చేపట్టి అసలైన వారికి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు సిబ్బంది వెలుగు ఉద్యోగుల పాత్ర లేకుండా కోట్ల రూపాయలు అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరుగుతుందన్నారు.