వృద్ధురాలికి పెన్షన్ మంజూరు. ఎంపీడీవో ఎస్ కే వి ప్రసాద్ వెల్లడి

Rtv Rahul
0
"

దిక్కు లేని అభాగ్యురాలికి దిక్కెవరు" వార్తకు స్పందన

ఎంపీడీవో ఎస్ కే వి ప్రసాద్ 


"RTVNEWS( లవకుశ)దిక్కులేని అభాగ్యురాలికి దిక్కెవరు"అని "అఖండ భూమి"పత్రికలో శుక్రవారం ప్రచురించిన వార్తకు మండల అభివృద్ధి అధికారి స్పందించారు . బట్ట పనుకుల పంచాయతీ లంక వీధి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు మహిళ ఇరట రాములమ్మకు డిసెంబర్ నెల నుండి పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని మండల అభివృద్ధి అధికారి ఎస్ కె.వి ప్రసాద్ అఖండ భూమి ప్రతినిధికి తెలిపారు. నడింపాలెం సచివాలయ సిబ్బంది ద్వారా వృద్ధురాలు ఇరట రాములమ్మ పూర్తి సమాచారం సేకరించడం జరిగిందని వృద్ధురాలు కు పెన్షన్ మంజూరు అయ్యేవిధంగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరుగిందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పంపిణీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలం ను ప్రథమ స్థానంలో ఉంచేందుకు మండల అభివృద్ధి అధికారిగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. పూర్తిస్థాయిలో పెన్షన్లు అందించేందుకు సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">