స్వయంభు తలుపులమ్మ ఆలయం వద్ద అన్న సమరాధన
వేలాదిగా తరలివచ్చిన భక్తజనులు
RTV NEWSగొలుగొండ. మండలం సిహెచ్ నాగ పురం పంచాయతీలో గల పల్లావూరు గ్రామ శివారులో స్వయంభు 150 సంవత్సరాల చరిత్ర గల శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన మంగళవారం భారీ ఎత్తున అన్న సమాధానా కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ అన్న సమరాధనా కార్యక్రమాన్ని ఆలయ స్థలదాత బాలం అర్జునరావు చైర్మన్ పల్లా గంగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు సహకారంతో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమీప గ్రామాలు అయినా పాత కేడీపేట, కృష్ణ దేవి పేట , కొంగగసింగి, తోటలూరు, రావణా పల్లి తదితర గ్రామాల నుండి వేలాదిమందిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు..