మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసిన నేను సైతం "కుసిరెడ్డి శివప్రసాద్"
RTVNEWS (లవకుశ)వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అరకు మాజీ ఎంపీ జి మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి అరకు నియోజకవర్గం లో అనేక ముఖ్యమైన విషయాలపై చర్చించడం జరిగిందన్నారు. గత వైసిపి ప్రభుత్వం హాయములో జరిగిన అభివృద్ధి, నవరత్నాల వల్ల అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులు ఏ విధంగా లబ్ధి పొందారో వివరించామన్నారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు మోసపూరితమైన సూపర్ సిక్స్ వంటి హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లి నట్లు తెలిపారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే గిరిజన ప్రాంతమైన
పాడేరు, అరకు, రంపచోడవరం పర్యటిస్తానని చెప్పారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులైన వెలుగు డిపార్ట్మెంట్ సిబ్బంది ఆశ వర్కర్లకు అలాగే వివిధ కాంట్రాక్టు ఉద్యోగుల కు జరిగిన అన్యాయం గురించి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ముఖ్యంగా ఎనర్జీ ఎస్ఎస్ కుఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తానని వారికి భరోసాగా నిలబెడతానని హామీ ఇచ్చినట్లు శివప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు