కొయ్యూరు మల్లికార్జున స్వామి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం. ఆలయ ధర్మకర్త ఎంవివి ప్రసాద్ అనిచెట్టి చిరంజీవి ఆధ్వర్యంలో

Rtv Rahul
0
కొయ్యూరు మల్లికార్జున స్వామి ఆలయంలో అన్న సమారాధన 

ఆలయ ధర్మకర్త ఎం వివి ప్రసాద్, అనిశెట్టి చిరంజీవి ఆధ్వర్యంలో 



RTVNEWS( లవకుశ)కొయ్యూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద పవిత్రమైన కార్తీక మాసంలో చివరి సోమవారం ఆలయ ధర్మకర్త జిసిసి మాజీ చైర్మన్ ఎం వివి ప్రసాద్, అనిశెట్టి చిరంజీవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం ఏర్పడిన నాటినుండి ప్రతి సోమవారం మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్న సమరాతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సమీప గ్రామాల ప్రజలతో పాటు వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా ఉదయం నుండి వందలాది మంది భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి శర్మ, ఉయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, అనిశెట్టి నాగేశ్వరరావు, నల్ల అబ్బాయి, మేడిపోయిన చిన్న, ఉప్పల రాజేష్ ఎం అశోక్ గాలి దేముడు రాజశేఖర్ మకాల సరస్వతి భక్తులు అనేకమంది పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">