తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతోనే కార్యకర్తలకు కొండంత అండ
రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు
RTVNEWS.తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తోనే పార్టీ కార్యకర్తలకు కొండంత అండ అని రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ కి కిల్లు వెంకట రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన పాడేరు పలు ప్రాంతాల్లో టిడిపి సభ్యత్వం నమోదును కిల్లు వెంకట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో పాడేరులో ఆదివాసి ఆటో కార్మిక సంఘం అలాగే మోదకొండమ్మ ఆలయ సమీపంలోనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. సభ్యత నమోదు తీసుకున్న వ్యక్తి ఎటువంటి ప్రమాదంలో అయినా మరణించినట్లయితే మట్టి ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలు అందించడమే కాకుండా విద్య వైద్య సదుపాయాలు కల్పనకు కూడా అందివ్వడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే గతంలో రెండు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేదని కానీ నేడు అయిదు లక్షలకు పెంచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తలకు ఇంతలా గుర్తింపు పార్టీలు లేవని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభ్యత నమోదులో టిడిపి నాయకులు కార్యకర్తలు పాలు పంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఉల్లి రాంబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు శోభ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు