గర్భిణీ స్త్రీలకు టేక్ హో బియ్యం పంపిణీ
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కె విజయ కుమారి
RTVNEWS..అంగన్వాడి పరిధిలో ఉన్న గర్భిణీ మహిళలందరికీ టేక్ హో బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కే విజయ్ కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో గాదిగుమ్మి పి మాకవరం చుట్టుబంధ టీట్ రాళ్ల దొడ్డవరం అంగన్వాడి కేంద్రాలను పరిశీలించిన జరిగిందని తెలిపారు దీంట్లో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో కార్గిల్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు సూచనలు సలహాలు అంగన్వాడీ సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని చిన్నారులు పట్ల అంగన్వాడి కార్యకర్తలు నిర్లక్ష్యం వహించరాదని ఆమె ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు