తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
రాష్ట్ర జిసిసి మాజీ చైర్మన్ ఎం వి వి ప్రసాద్
RTVNEWS.గిరిజన ప్రాంతంలో అభివృద్ధి , సంక్షేమ పాలన అయిన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని జిసిసి మాజీ చైర్మన్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎం వివి ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలో రేవళ్ళు గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో చేపట్టబోయే105 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణపు పనులకు స్థానిక సర్పంచ్ జలుమూరు వెంకటలక్ష్మితో కలసి ఎంవివి ప్రసాద్ కొబ్బరికాయలు కొట్టిశంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో చేపడుతూ ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంపై కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తద్వారా మన్య ప్రాంతమంతా అభివృద్ధి చెందేందుకు దోహత పడుతుందని అన్నారు. ఇప్పటికే మన్యంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మా కాడ బాలరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పలరాజు అప్పారావు బిజెపి నాయకులు మేడిపోయిన చిన్న రేవల్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.