సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ

Rtv Rahul
0
సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి .

నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణ దేవి పేట సబ్ ఇన్స్పెక్టర్ వై.తారకేశ్వరరావు.. 

RTVNEWS:సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తీవ్రంగా నష్టపోతారని నర్సీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణ దేవి పేట సబ్ ఇన్స్పెక్టర్ వై తారకేశ్వరరావు అన్నారు .శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్  కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ. అనుమానత వ్యక్తుల నుండి సెల్ఫోన్లో వచ్చే, వీడియోలు, మెసేజ్లు పట్ల అప్రమత్తంగా లేకపోయినట్లయితే సైబర్ క్రైమ్ నేరస్తులు పలు రకాలుగా మోసాలకు పాల్పడతారన్నారు. మరికొందరు వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు గురించి బ్లాక్మెయిలింగ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు పట్ల ఎవరికి చెప్పుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతూ అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న  సంఘటనలు కూడా అనేక చోట్ల సంభవిస్తున్నాయి. యువత  సన్మార్గంలో నడిచి తల్లిదండ్రులకు తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రుత్తల గంగరాజు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">