ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కె విజయ కుమారి
RTVNEWS :కొయ్యూరు మండలంలో మటం భీమవరం పంచాయతీ వాలు గూడెం గ్రామానికి చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త కొయ్యూరు మీటింగ్ కు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కె విజయ కుమారి పరామర్శించి మానవతా దృక్పథంతో కొంత నగదు అందించారు. బుధవారం వాలుగూడు గ్రామంలో కార్యకర్తకుటుంబాన్ని పరామర్శించి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త కు రావలసిన బీమా నగదు కోసం కావలసిన డాక్యుమెంటులను తీసుకున్నామని తెలిపారు. అనంతరం మటం భీమవరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అక్కడే ఉన్న ఇద్దరు గర్భవతులకు సీమంతం నిర్వహించి టి హెచ్ ఆర్ ఇచ్చారు. అనంతరం చీడికోట, పోతవరం గ్రామాలను సందర్శించి గ్రామంలోఉన్న ముగ్గురు గర్భవతులు కూడా సీమంతాలు నిర్వహించి టేక్ హోమ్ బియ్యం అందజేయడం జరిగిందని తెలిపారు .ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిఓ విజయ్ కుమారి మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే చెడు అనర్థాల గురించి గ్రామస్తులకు వివరించారు . గంజాయి పండించడం , రవాణా చేయడం నేరమని అని తెలిపారు.అలాగే బాల్యవివాహాల చేయడం చట్టరీత్య నేరమని అమ్మాయికి 18 సంవత్సరాలు అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి అయినప్పుడే వివాహాలు చేయాలని అన్నారు